ఆడియో

నిజరూపము ఉన్నప్పుడు దాని యొక్క ఛాయ ఏర్పడుతుంది.
ఎందుకనగా ఆత్మీక లోకములో పరలోక కుటుంబము ఉన్నది,
ఛాయ అయిన భౌతికలోకములో కుటుంబము ఉన్నది.
ఒక ఛాయ అయిన భూలోక కుటుంబం, రక్త సంబంధం కలిగియున్నట్లుగా,
క్రొత్తనిబంధన యొక్క పస్కాలో వాగ్దానం చేయబడిన
క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం
పరలోక కుటుంబ సభ్యులుగా ఉండగలము.