రెండవసారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, 1948లో ముప్పై సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొందారు మరియు దావీదు రాజు యొక్క ప్రవచనం ప్రకారంగా, సత్యపు వెలుగును ప్రకాశించుటకు తన సువార్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మానవాళిని రక్షించుటకు ఒక మానవునిగా ఈ భూమిపైకి వచ్చి, మహిమ మరియు గౌరవం యొక్క జీవితాన్ని కాక, వేదన మరియు శ్రమలతో నిండిన జీవితాన్ని జీవించారు.
ఆయన 1918లో జన్మించినందున, జపాన్ ఆక్రమణ సమయంలో ఆయన దోపిడీ మరియు అణిచివేత యొక్క యుగాన్ని అనుభవించవలసి వచ్చెను. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆత్మీకంగా ఒక బంజరు మరియు వినాశకరమైన పరిస్థితులలో ఉండెను. భౌతికంగా, కూడా, పర్యావరణం చాలా తక్కువగా ఉండెను. ఆ సమయంలో, జపాన్ సామ్రాజ్యవాదం నుండి ఇప్పుడే విముక్తి పొందిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 1950లో చెలరేగిన కొరియా యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా దిగజారింది, మరియు ప్రజలందరూ తీవ్రమైన జీవిత కష్టాలను అనుభవించవలసి వచ్చెను.
2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు చేసినట్లుగానే, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఆయన తృణీకరించబడి అవమానించబడినప్పటికినీ, అన్ని కష్టతరమైన ఉద్యోగాలు చేస్తూ, జీవపు నియమాన్ని పాటించారు మరియు సువార్తను ప్రకటించారు.
అనేక ప్రజలు జీవనోపాధి పొందుటకు కష్టపడి ఆకలితో ఉన్న ఆ రోజులలో, విశ్రాంతి దినముతో సహా దేవుని ఆజ్ఞలను గైకొనే మాదిరిని ఏర్పరుచుటకు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ప్రజలు తప్పించుకునే తాపీపని చేయవలసి వచ్చెను. ఈ కష్టమైన ప్రయాసము ఆయనను తన మెడపై వెనుక చేతి పరిమాణంలో బొబ్బలు కలిగియుండేలా చేసినది. ఆయన కష్టపడి సంపాదించిన జీతమును ప్రచారపు ఖర్చు కొరకు మరియు జీవిత సత్యమును బయలుపరిచే పుస్తకాలు వ్రాయుటకు ఉపయోగించారు. కాబట్టి ఆయన తరుచుగా బార్లీ గంజితో తన ఆకలిని తీర్చుకొనేవారు లేక భోజనాన్ని మానివేశారు. అటువంటి కష్టమైన పగటి శ్రమ తర్వాత, ఆయన రాత్రంతా మానవాళి యొక్క రక్షణ కొరకు పుస్తకాలను వ్రాశారు, మరియు అనేక రోజుల ఉపవాసం మరియు బలిదానం ద్వారా క్రొత్త నిబంధన సత్యాన్ని పునరుద్ధరించారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపై తన మానవ జీవితాన్ని ముగించడానికి నాలుగు సంవత్సరాల ముందు మీడియా ద్వారా తన మరణం గురించి ప్రవచించారు, మరియు సంఘాన్ని తన శిష్యులకు అప్పగించారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చి ఆఫ్ గాడ్ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి యొక్క మాదిరిని అనుసరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 7.8 బిలియన్ల ప్రజలకు క్రొత్త నిబంధన యొక్క సత్యమును గైకొంటూ రక్షణ యొక్క వార్తలను ప్రకటిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం