మొదటిగా, తల్లి పాలు తల్లి మరియు బిడ్డల మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందిస్తుంది మరియు పోషకాల యొక్క కీలకమైన వనరుగా పనిచేస్తుంది.
కోలోస్ట్రమ్ అనే ప్రారంభ పాలు, ఒక సహజ టీకా వలె పనిచేస్తూ, నవజాత శిశువుకు సంరక్షణను అందిస్తుంది.
తల్లి పాలులో కొలొస్ట్రమ్ కారణంగా, శిశువు వివిధ వ్యాధుల నుండి 100% సంరక్షణను పొందుకుంటుంది.
తల్లి పాలు ప్రాముఖ్యతను గుర్తించడం భౌతిక రంగంలోనే కాదు, ఆత్మపరమైన రంగంలో కూడా ఒక ముఖ్యమైన సూత్రాన్ని నొక్కి చెప్పుచున్నది.
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
ప్రకటన 4:11
భూమిపై తన బిడ్డకు తల్ల పాలును ఇచ్చు తల్లి ఉన్నట్లుగానే, పరలోకంలో మనకు ఆత్మపరమైన తల్లి పాలును ఇచ్చు ఆత్మపరమైన తల్లి ఉండవలెను కదా?
ఒక తల్లి తన పిల్లలను ఆత్మపరమైన పోషణతో పోషించే భూసంబంధమైన అనుభవానికి సమాంతరంగా పరలోకంలో ఆత్మపరమైన తల్లి ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథము ధృవీకరిస్తుంది.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.
గలతీయులు 4:26
అంత్య దినములలో పరలోకపు యెరూషలేము తల్లి మానవాళికి రక్షణ కొరకు అవసరమైన ఆత్మపరమైన తల్లి పాలు, అనగా ఆత్మపరమైన తెల్లని పాలును ఇచ్చుదురని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తుంది.
యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. . . . ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తినొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
యెషయా 66:10-13
భౌతిక తల్లి ద్వారా పిల్లలు జీవమును పొందుకున్నట్లుగా, మనము ఆత్మపరమైన తల్లి ద్వారా రక్షణను పొందగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం