బాప్తిస్మము ద్వారా మానవాళి గత పాపాలన్నిటినీ మరియు పాపపు స్వభావాలన్నిటినీ కడిగివేసి నీతి క్రియల ద్వారా క్రొత్తగా జన్మించినప్పుడు, వారు పెండ్లికుమార్తె అయిన పరలోక తల్లి యొక్క అందమైన నారబట్టగా మారి, పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా నిత్య మహిమను ఆనందించెదరు.
పరలోకంలో రాజరిక యాజకులుగా మారుటకు, ఒకరు పరిశుద్ధగ్రంథం ద్వారా దేవుని బోధనలను పొందుకోవలెను. దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించడమే కాక, “ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండండి, ఒకరినొకరు ప్రేమిస్తూ, మరియు క్రొత్త స్వభావాన్ని ధరించండి” అని చెప్పిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి బోధనలను కూడా తమ హృదయాలపై లిఖించుకొని, మంచి క్రియల ద్వారా సర్వలోకమునకు దేవుని మహిమను బయలుపరుస్తూ, వాటిని ఆచరణలో పెట్టుటారు.
ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. ప్రకటన 19:7-8
శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం