ఏమైనా, కళాశాలలో, నా పెంపకం లేదా నా మత విశ్వాసాలు నిజమైనవా లేదా
అది కేవలం ఆచారాలు మరియు సంప్రదాయాలా అని ప్రశ్నించడం ప్రారంభించాను.
కాబట్టి నేను సమాధానాలు వెతుకుతున్నప్పుడు, దేవుని సంఘ సభ్యుల నుండి
పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయుటకు నేను ఆహ్వానించబడ్డాను.
మరియు పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేసే సమయంలో, వారు నాకు
పరిశుద్ధ గ్రంథంలో చూపించిన విషయాల పట్ల నేను నిజంగా ఆశ్చర్యపోయాను.
కాబట్టి, దేవుని సంఘము బోధిస్తున్నది చట్టబద్ధమైనదని నేను నిజంగా చూడగలిగాను
మరియు ఇది ఖచ్చితంగా సత్యము.
దేవుని సంఘంలో నేను నేర్చుకున్న విషయాలన్నిటిలోకెల్లా, తల్లియైన దేవుని గురించి
తెలుసుకోవడమే నాకు అత్యంత కన్నులు-తెరవబడే మరియు హత్తుకునే విషయం అని నేను చెప్పగలను.
కాబట్టి, నేను దేవుని సంఘము నుండి ప్రకటన గ్రంథంలోని నూతన యెరూషలేము గురించి తెలుసుకున్నప్పుడు,
మరియు ఆమె మన పరలోక తల్లి అని తెలుసుకున్నప్పుడు, దానిని పరిశుద్ధగ్రంథం ద్వారా చూపించినప్పుడు,
నేను నిజంగా ఆశ్చర్యపోయాను.
మరియు అది కన్నులు-తెరవబడే విషయము ఎందుకనగా మనమెల్లప్పుడూ సంఘమునకు వెళ్ళి
తండ్రియైన దేవున్ని విశ్వసిస్తాము, కాని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మన పరలోక తల్లి,
తల్లియైన దేవుని గురించి సాక్ష్యమిచ్చే విషయం కలదు.
మరియు నేను గొఱ్ఱెపిల్ల యొక్క భార్య అయిన, పెండ్లికుమార్తె అనగా నూతన యెరూషలేము గురించి
తెలుసుకున్నప్పుడు, దేవుడు, “మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము” అని చెప్పినపుడు,
ఆదికాండము యొక్క ప్రారంభం నుండి కూడా తల్లియైన దేవుడు సాక్షమివ్వబడటం చూసి ఆశ్చర్యపోయాను.
కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకున్నారు.
మీరు మొదటి గ్రంథమైన ఆదికాండము నుండి చివరి గ్రంథమైన ప్రకటన వరకు తల్లియైన దేవుని గురించి తెలుసుకున్నారు.
మరియు తల్లియైన దేవుని యొక్క సాక్ష్యము పరిశుద్ధగ్రంథము యొక్క ప్రారంభం నుండి ఉన్నదని నేను గ్రహించగలిగాను.
ఇది లేఖనాల అంతటా నిండియున్నది.
నేను పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు నాకు తల్లియైన దేవున్ని విశ్వసించటం సులభంగా ఉండెను,
ఏమైనా, తల్లియైన దేవుడు శరీరధారిగా వచ్చారని నమ్మటం కొంచెం కష్టంగా ఉండెను.
మరియు రెండువేల సంవత్సరాల క్రితం యేసుకు జరిగిన దానిని తిరిగి చూడటం ద్వారా
చివరకు నేనది గ్రహించగలిగానని అనుకుంటున్నాను.
మరియు దాని ద్వారా, శరీరధారిగా వచ్చిన పరలోక తల్లిని స్వీకరించుటకు,
నా స్వంత పరిమితమైన ఆలోచనలు, తలంపులు, లేక నా ఊహల ద్వారా
నేను తల్లియైన దేవున్ని సమీపించకూడదని లేదా విశ్వసించకూడదని గ్రహించగలిగాను.
మరియు నేను పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనాల ద్వారా మాత్రమే
పరలోక తల్లిని చూసి విశ్వసించవలెను.
తల్లియైన దేవున్ని అంగీకరించుటలో ఎవరికైనా కష్టంగా ఉన్నట్లైతే,
వారి చుట్టూ ఉన్న సృష్టిని చూడటం ద్వారా తల్లియైన దేవుని గురించి అర్థం చేసుకోవడం
ప్రారంభించమని నేను వారికి చెబుతాను.
జీవము ఒక తల్లి నుండి వచ్చుట,
అది దేవుడు స్వయంగా రూపొందించిన మార్పులేని ప్రకృతి ధర్మము.
మరియు దానికి కారణమనగా మనకు నిత్య జీవమును ఇచ్చే తండ్రి మాత్రమే కాక,
తల్లి కూడా ఉన్నారని దేవుడు మనకు చూపించాలనుకున్నారు.
నేను దేవుని సంఘమునకు రాక ముందు, నేను జీవితంలో సరియైన నిర్ణయాలు
తీసుకుంటానా, మరియు నా ఏకైక జీవితాన్ని మంచిగా జీవించగలనా లేదా
అని ఎల్లప్పుడూ ఆందోళన చెందాను.
ఏమైనా, సత్యమును పొందుకొని దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకున్న తర్వాత,
చివరకు నేను దేవునికి విధేయతగా ఉండగలిగినందుకు మరియు దేవుని బిడ్డగా
యోగ్యమైన జీవితాన్ని జీవించి పరలోకంలో ప్రవేశించగలనని ఆత్మవిశ్వాసంగా,
సంతోషంగా మరియు ప్రశాంతంగా భావించాను.
ఎవరైనా దేవుని సంఘము వద్దకు రావలెనా అని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లైతే,
బైబిల్ ను అధ్యయనం చేసే అవకాశం ఉన్నప్పుడెల్లా కేవలం రండి అని నేను సిఫారసు చేస్తాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం