ప్రపంచమంతా క్రిస్మస్ నాడు (డిసెంబర్ 25) యేసు క్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు.
ఏమైనా, యేసు క్రీస్తు యొక్క పుట్టిన తేదీ పరిశుద్ధ గ్రంథములో లేదు.
ఇది కేవలం పొలంలో తమ మందలను కాపలా కాస్తున్న గొఱ్ఱెల కాపరులు,
యేసును స్తుతించారని సెలవిస్తుంది. (లూకా 2:8)
చలికాలంలో పొలాలలోని మందలను కాపలా కాయటం సాధ్యం కాదు.
యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించారా?
తొలినాటి క్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోలేదు.
అయితే, క్రిస్మస్ ఎక్కడ నుండి ఉద్భవించినది?
డిసెంబర్ 25, క్రిస్మస్ . . .
“డిసెంబర్ 25 యేసు క్రీస్తు యొక్క జన్మదినము కాదు, కాని సూర్య-దేవుని యొక్క జన్మదినము.
అపజయమెరుగని సూర్యుని కొరకు అన్యమత పండుగ నుండి క్రిస్మస్ ఉద్భవించింది.” [ఎన్సైక్లోపీడియా బ్రిటానికా]
‘ఏమిటి? క్రిస్మస్ అన్యమత పండుగ నుండి ఉద్భవించిందా?’
“ప్రాచీన రోమాలో, డిసెంబరు 17 నుండి 24 వరకు సాటునేలియా అనే పండుగ ఉండేది.”
[క్రైస్తవ సంఘము యొక్క చరిత్ర]
“ఈ పండుగ సమయంలో, ప్రజలు సంపద లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఉల్లాసంలో మునిగిపోయారు.” [క్రైస్తవ సంఘము యొక్క చరిత్ర]
‘లేదు! ఇది ఎలా సాధ్యం!!! క్రిస్మస్, డిసెంబర్ 25, యేసు క్రీస్తు యొక్క జన్మదినము కాదు!!!’
“దినములు పొడిగించటం ప్రారంభమయ్యే డిసెంబర్ 25,
మిత్ర దేవుని పుట్టిన రోజుగా పరిగణించబడెను.”
[ఎన్సైక్లోపీడియా బ్రిటానికా]
మిత్రా యందు విశ్వాసం విచ్ఛిన్నం చేసే సాకుతో,
రోమన్ క్యాథలిక్ సంఘము,
“సూర్య-దేవుని యొక్క జన్మదినమును” యేసు క్రీస్తు యొక్క
జన్మదినముగా మార్చి పండుగను ఆనందించారు.
[జేమ్స్ జి. ఫ్రేజర్ ది గోల్డెన్ బోహ్ ]
క్రిస్మస్ చెట్టు అనేది చెట్టు ఆరాధన యొక్క అన్యమత ఆచారం నుండి ఉద్భవించింది. [ఎన్సైక్లోపీడియా బ్రిటానికా]
తెల్లటి గడ్డంతో, ఎరుపు రంగు సూట్‌తో శాంతా క్లాజ్ యొక్క చిత్రం, కోకా-కోలా ప్రకటన కోసం 1931లో సృష్టించబడింది. [హాడన్ సండ్బ్లోమ్ చేత చిత్రీకరించబడినది]
క్రిస్మస్ యేసు క్రీస్తు జన్మదినము కాదని సంఘాలకు బాగా తెలుసు.
ఏమైనా, క్రిస్మస్ యేసు క్రీస్తు యొక్క జన్మదినమని వారు ఇంకా అబద్ధం చెబుతున్నారు.
ఈ వాస్తవం గురించి క్రైస్తవులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు.
“క్రిస్మస్ ను డిసెంబర్ 25న జరుపుకోవటం అది క్రీ.శ. 354 తర్వాత.” [వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా]
క్రీ.శ. 354 తర్వాత? యేసు క్రీస్తు యొక్క శిష్యులు మరియు అపొస్తలులు ఎన్నడూ క్రిస్మస్ ను ఆచరించలేదు!
“క్రిస్మస్ అనునది దేవుని చేత స్థాపించబడలేదు,
పరిశుద్ధ గ్రంథం ఆధారంగాను స్థాపించబడలేదు.”
[సైక్లోపీడియా బిబ్లికల్, థియోలాజికల్ మరియు ఎక్లెసియాస్టికల్ లిటరేచర్]
వారు సూర్య-దేవుని యొక్క జన్మదినమును యేసు క్రీస్తు యొక్క జన్మదినముగా మార్చారు!
ఇది భయంకరమైనది!
ప్రజలు మానవులు కల్పించిన నియమాలను ఆచరించినట్లైతే,
వారు దేవున్ని వ్యర్థముగా ఆరాధిస్తారని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది. (మత్త 15:9)
అన్యమత ఆచారాలను పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు ఎలా నాశనమయ్యారో
పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడింది! (యెహే 11:8~12)
సీనాయి అరణ్యంలో, వారు విగ్రహాన్ని ఆరాధించేటప్పుడు
వారు దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నారని భావించారు. (నిర్గ 32:1~6)
ఉత్తర ఇశ్రాయేలు రాజైన యరొబాము,
దేవున్ని ఆరాధిస్తున్నాడని సమర్థించుకుంటూ, తన స్వంతగా ఎంచుకున్న
ఒక నెలలో పండుగను ఆచరించాడు. (1 రాజు 12:25-33)
ఏమైనా, విగ్రహారాధన చేసిన వారందరూ నాశనమయ్యారు.
అదేవిధంగా, వారు క్రిస్మస్ నాడు యేసు క్రీస్తును ఆరాధిస్తారని చెప్పుకున్నప్పటికినీ, అది కేవలం విగ్రహారాధన మాత్రమే.
విగ్రహారాధన యొక్క ముగింపు నాశనము.
రెండవసారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి చేత స్థాపించబడిన దేవుని సంఘము,
పరిశుద్ధ గ్రంథంలో కనిపించని సూర్య-దేవుని యొక్క జన్మదినమైన, క్రిస్మస్ ను జరుపుకొనదు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం