ఎందుకనగా అనేక అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ బోధనలతో నిండిన
ఈ యుగంలో, దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం సత్యము మరియు
అసత్యమునకు మధ్యన భేదమెంచగలము.
లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని
తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు,
అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యోహాను 5:39
తాను దేవుడైన యేసును సరిగ్గా గ్రహించినపుడు పరలోక రాజ్యము
యొక్క తాళపు చెవులను పొందుకున్న పేతురు వలె,
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో వచ్చిన తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుడిని మనం సరిగ్గా గ్రహించునపుడు,
మనం పరలోకపు గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలము.
భూమియందున్నవి పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరి వంటిదని
వ్రాయబడెను. ప్రత్యేకంగా భూలోక కుటుంబ వ్యవస్థ ద్వారా, దేవుడు మనకు పరలోక
కుటుంబ వ్యవస్థ గురించి మేల్కొల్పారు మరియు పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా
ఇవ్వబడే దేవుని యొక్క శరీరము మరియు రక్తం ద్వారా మాత్రమే మనం దేవుని
యొక్క నిజమైన పిల్లలుగా మారగలమని మనకు తెలియజేశారు.
(పరలోక కుటుంబ వ్యవస్థ తండ్రి, తల్లి, మరియు పిల్లలను కలిగియున్నది)
నిజమైన తల్లి ఎవరో గుర్తించుటకు దేవుడు సొలోమోనకు
జ్ఞానము అనుగ్రహించినట్లుగానే, ఈరోజులలో దేవుని సంఘము
యొక్క పరిశుద్ధులకు పరిశుద్ధగ్రంథము యొక్క వాక్యముల ద్వారా
జ్ఞానము ఇవ్వబడెను మరియు తల్లియైన దేవుని వద్దకు వచ్చేలా దీవించబడ్డారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం