ఈరోజు దేవుని సంఘంలో ఏటా జరుపుకునే ప్రాయశ్చిత్తార్థ దినము, అరణ్యంలో ఇశ్రాయేలీయుల యొక్క నలభై సంవత్సరాల జీవితం నుండి ప్రారంభమైనది; మరియు ప్రాయశ్చిత్తార్థ దినము ద్వారా, పాప క్షమాపణ మరియు రక్షణ మార్గమును దేవుడు ప్రజలందరికీ తెలియజేశారు.
ప్రాయశ్చిత్తార్థ దినము అనునది మోషే పది ఆజ్ఞలను పొందుకొనుటకు నలభై రోజులు ఉపవాసం ఉండి సీనాయి పర్వతముపై ఉన్నప్పుడు బంగారు దూడను ఆరాధించిన ఇశ్రాయేలీయులను దేవుడు క్షమించిన దినము. అది దేవుడు వారి పాపాలను క్షమించే సూచనగా వారికి రెండవసారి పది ఆజ్ఞలను అనుగ్రహించిన దినము.
సాధారణ సమయాలలో, ప్రజల యొక్క పాపాలన్నీ ఒక సంవత్సరం పాటు పరిశుద్ధ ఆలయంలో ఉంచబడ్డాయి. మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు, ప్రధాన యాజకుడు విడిచిపెట్టు మేకపై చేతులు ఉంచి, పాపాలు దానిపైకి బదిలీ చేయబడ్డాయి మరియు విడిచిపెట్టు మేక అరణ్యానికి పంపబడెను.
విడిచిపెట్టు మేక చనిపోయినపుడు, చివరకు ప్రజల పాపాలన్నీ క్షమించబడ్డాయి. అదేవిధంగా, గుడారము యొక్క నిజ స్వరూపమైన తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు, మానవాళి యొక్క పాపాలను మరియు శ్రమలన్నిటినీ భరిస్తారు, మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు వారు పాపాలన్నిటినీ సాతానుకు బదిలీ చేస్తారు, తర్వాత సాతాను నరక శిక్షలోకి ప్రవేశిస్తాడు.
వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు. ప్రకటన 20:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం