మన శరీరాలు దేవుడు తన రక్తంతో కొనుగోలు చేసిన దేవుని యొక్క మందిరము కనుక, అరణ్యంలో తమ ప్రయాణము యొక్క చివరలో సాతాను చేత శోధింపబడి లైంగిక వ్యభిచారంలో పాలుపుచ్చుకున్న ఇశ్రాయేలీయుల వలె మరియు ఆకలి కొరకు తన జేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావు వలె మనం ప్రవర్తించకూడదు. మనం ఈ దుష్ట మరియు వ్యభిచార ప్రపంచాన్ని కాక, దేవున్ని వెంబడించే నీతివంతమైన జీవితాన్ని జీవించవలెను.
ఈ లోకము పాపము మరియు వ్యభిచారంతో నిండియున్నప్పుడు, దేవుడు ప్రపంచాన్ని తీర్పు తీర్చును. నోవహు దినాలలో దేవుడు దుష్ట తరాన్ని నీటితో మరియు సొదొమ గొమొఱ్ఱా యొక్క దినాలలో అగ్నితో తీర్పుతీర్చినట్లుగానే, ఈ దుష్ట మరియు వ్యభిచార తరాన్ని తాను అగ్నితో తీర్పుతీర్చునని దేవుడు ప్రవక్తల ద్వారా ముందే చెప్పారు మరియు తన పిల్లలకు పరిశుద్ధంగా మరియు దేవభక్తిగా జీవితాన్ని జీవించాలని బోధించారు.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. 2 పేతురు 3:6-12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం