దేవుడు తన పిల్లలకు ప్రతి ఆరాధన ద్వారా పరలోకపు ఆశీర్వాదాలను
ఇచ్చును కనుక,
దేవున్ని విశ్వసించే మరియు దేవున్ని ఆరాధించే
క్రియలే స్వయంగా సంతోషము మరియు ఉత్సాహమైనది.
పరలోకం పట్ల నిరీక్షణ లేని బాధ్యత గల విశ్వాస జీవితం
శోధనను తీసుకువస్తుంది. సాతాను యొక్క కుట్రతో ఓడిపోయిన
ఆదాము మరియు హవ్వ యొక్క మార్గాన్ని మనం వెంబడించక,
యోబు వలె మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగియుంటూ,
అంతం వరకు దేవున్ని ఆరాధించవలెను, మరియు యేసు యొక్క
మాదిరిని వెంబడిస్తూ, దేవుని వాక్యం ద్వారా,
శోధనను జయించవలెను.
పరలోకమునకు గల మన మార్గమును ఆటంకపరిచే లౌకిక శోధనలన్నీ మనకు పరీక్షలు.
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలుగా అరణ్యంలోని ప్రతి క్షణమందు శోధింపబడినట్లుగానే,
పరలోక కనాను దిశగా నడుచుచున్న దేవుని సంఘ సభ్యులకు పరీక్షలు ఇవ్వబడును,
కాని మనం తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం
కలిగియున్నట్లైతే,
మనం చివరలో ఆ పరీక్షలను తట్టుకొని పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము.
“నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.” ప్రకటన 3:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం