దేవున్ని “మన” అని వర్ణించిన ఆదికాండము ఈ గ్రంథములో చాలా మర్మమైన భాగం అని సెలవిస్తుంది.
తండ్రియైన దేవుడు నరులను సృష్టించినప్పుడు, “నా స్వరూపములో చేయుదును . . . ,” అని చెప్పక, “మన స్వరూపములో నరులను చేయుదుము . . . అని సెలవిచ్చారు.” (ఆదికాండము 1:26)
దేవుడు తండ్రి ఒక్కరే! అలాంటప్పుడు, పరిశుద్ధ గ్రంథము దేవున్ని “మన” అని ఎందుకు వర్ణిస్తుంది?
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” ఆదికాండము 1:1
పరిశుద్ధ గ్రంథము యొక్క అసలు గ్రంథమైన తోరాలో, ఇది “ఎలోహిమ్” అనగా “దేవుళ్ళు” అని వ్రాయబడెను.
ఎలోహిమ్ అనగా ఏకవచన రూపమును సూచించే “ఎల్” లేదా “ఎలోహా” యొక్క బహువచనము అయిన “దేవుళ్ళు”.
పరిశుద్ధ గ్రంథములో, దాదాపు 2,500 సార్లు [ఎలోహిమ్] దేవుళ్లుగా నమోదుచేయబడెను.
తండ్రియైన దేవుడు మాత్రమే కాకుండా మరొక దేవుడు కూడా ఉన్నారని అర్థం. దేవుని స్వరూపములో పురుష మరియు స్త్రీ సృష్టింపబడెను.
“దేవుడు [ఎలోహిమ్] తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని [ఎలోహిమ్] స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.” ఆదికాండము 1:27
“తండ్రియైన దేవుని” స్వరూపమందు పురుషు సృష్టించబడెను. “తల్లియైన దేవుని” స్వరూపమందు స్త్రీ సృష్టించబడెను. సృష్టికర్త అయిన “ఎలోహిమ్” అనగా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
మరియు దేవుడు అంత్య దినములలో ప్రత్యక్షమవుతారని ప్రవచింపబడెను. (1 తిమోతి 6:15)
కుమారుని యొక్క యుగంలో, దేవుడు యేసు క్రీస్తుగా ప్రత్యక్షమాయెను.
ఈ యుగంలో, ఎలోహిమ్ దేవుడైన, “తండ్రియైన దేవుడు” మరియు తల్లియైన దేవుడు, మానవాళిని రక్షించడానికి శరీరధారిగా వచ్చును.
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవున్ని పరిశుద్ధాత్మ యుగంలో రక్షకుడైన ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా విశ్వాసించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం