దేవుని యొక్క పరిశుద్ధులు అబ్రహాము యొక్క వారసుడైన ఇస్సాకు లాంటివారని మరియు
సీయోనులో నివసించేవారు ఆనందంగా మరియు సంతోషంగా ఉంటారని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది.
ఈ ప్రవచనాల ద్వారా, ఇస్సాకు [నవ్వు] అనే పేరు యొక్క అర్థం వలె,
సీయోను యొక్క పిల్లలు ఎల్లప్పుడూ ఆనందంగా మరియు సంతోషంగా ఉండాలని
దేవుడు కోరుకుంటున్నారని మనం చూడవచ్చు.
ఈ కారణంగా, పరలోకం పట్ల నిరీక్షణ కలిగియుండి, దేవుని ప్రేమను పంచుకునే
జీవించే దేవుని సంఘము సభ్యులు కృతజ్ఞతలు మరియు నవ్వులతో నిండియున్నారు.
ఇంటిని నిర్మించునపుడు ఒక రూపకర్త ఉన్నట్లే, మానవాళి అంతా కోరుకునే
నిత్యజీవం యొక్క రూపకర్త కూడా ఉన్నారు.
సమస్త విశ్వంలో నిత్య జీవం కలిగియున్నవారు దేవుడు తప్ప ఎవ్వరూ లేనందున,
మానవాళికి నిత్య జీవం ఇచ్చుటకు తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు ఈ భూమిపైకి వచ్చారు.
దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును;
నీవతనికి ఇస్సాకు [నవ్వు] అను పేరు పెట్టుదువు.
ఆదికాండము 17:19
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.
గలతీయులకు 4:28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం