మనం ఎక్కడి నుండి వచ్చాము? మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళుదుము? శతాబ్దాలుగా, తత్వవేత్తలు, వేదాంతవేత్తలు మరియు శాస్త్రవేత్తలు జీవిత స్వభావాన్ని కనుగొనడానికి అధ్యయనం చేశారు, కానీ వారు స్థిరమైన మరియు ఖచ్చితమైన దైహిక సిద్ధాంతాన్ని అందించలేకపోయారు. జీవితానికి అర్థం తెలియక ప్రజలు సంచరిస్తూ, ఉద్యోగాలతో ముడిపడి మరణాన్ని ఎదుర్కొంటున్నారు.
గాలికి ఆకులు రాలిపోయినట్లు, మన జీవితం రాలిపోయిన ఆకుల వంటి ఖాళీ కల మాత్రమే అని చెప్పబడినది. ఏమైనా, మన జీవితంలో దాచబడిన ఒక ముఖ్యమైన విషయము కలదు.
మరణం అనగా పరలోకరాజ్యనికి “మరల పోవడం” అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది. (ప్రసంగి 12:7)
"మరల" అనగా మీరు ఎక్కడ నుండి వచ్చారో అక్కడకు తిరిగి వెళ్లడం.
దేవుడు భూమిని సృష్టించిన మునుపు, మీరు పరలోకరాజ్యములో ఉండేవారు.
“నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.” యోబు 38:1-21
యోబు భూమ్మీద పుట్టకముందు పరలోకంలో ఉండేవాడని దేవుడు యోబునకు బోధించెను.
యోబు వలె మనం కూడా భూమిపై పుట్టకముందు పరలోకంలో ఉండేవారము.
మనం భూమిపై ఉన్నప్పుడు,
మన ఆత్మ కొంతకాలం శరీరంలో నివాసించే ఒక "గుడారం" (2 కోరింధి 5:1)
కావున, యేసు క్రీస్తు చేత బోధింపబడిన అపొస్తలులు, మానవజాతిని “విదేశీయులు” మరియు “యాత్రికులం” అని పిలిచారు.
మన స్వదేశం "పరలోకం" అని వారికి తెలుసియుండెను. (హెబ్రీ 11:13)
సమయం, స్థలం మరియు వేగానికి పరిమితి లేని పరలోకంలో, మనం పాపం చేసియున్నాము.
మానవజాతి పరలోకపు జ్ఞాపకాలను కోల్పోయి భూమిపై పడద్రోసి వేయబడెను.
పాపపు నొప్పితో మూలుగుతూ, రకరకాల విపత్తుల భయంతో ప్రజలు వణికిపోవుచున్నారు.
మీరు మన అందమైన మరియు మహిమనిత్వమైన గృహమును కోల్పోవం లేదా?
మన మహిమనిత్వమైన పరలోక గృహానికి తిరిగి వెళ్ళే మార్గం లేదా?
సమాధానం కనుగొన్నప్పుడు మాత్రమే మనము తిరిగి వెళ్ళగలము.
2,000 సంవత్సరాల క్రితం, పరలోకంలో మనం చేసిన పాపాలకు క్షమాపణ ఎలా పొందగలమో యేసు క్రీస్తు వచ్చి మనకు బోధించెను
మరియు పరలోక రాజ్యానికి మార్గమును తెరిచెను. (మత్తయి 26:26)
ఈ యుగంలో, ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అనగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు నశించబడిన పస్కా పండుగను పునరుద్ధరించారు మరియు మన శాశ్వతమైన పరలోకరాజ్యనికి మమ్మల్ని నడిపించారు. మీరు పునరుద్ధరించబడిన పస్కాను ఆచరించి, మీరు కోర్పోతున్నా మన పరలోకపు గృహానికి తిరిగి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మేము మిమ్మల్ని మన నిత్యమైన పరలోకరాజ్యనికి ఆహ్వానిస్తున్నాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం