దేవుని యొక్క శక్తి ద్వారా, 430 సంవత్సారలుగా బానిసత్వంగా ఉన్న ఇశ్రాయేలియులు విమోచించబడి కానానునకు వెళ్లెను. ఏమైనా, ఇశ్రాయేలీయులు వారిని విమోచించిన దేవుని యొక్క కృపను మరచిపోయారు “ఈ ఐగుప్తియుండి మమ్మల్ని ఎందుకు నడిపించారు?” ఫిర్యాదు చేసిన ప్రజలు తాపకరమైన సర్పము చేత కరవబడి మరణించెను. (సంఖ్య 21:6)
మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. సంఖ్య 21:8
అయితే వారిని రక్షించినది ఇత్తడి సర్పమా?
కాదు. కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకురు అనే దేవుని యొక్క మాటలు చేత వారు రక్షించబడ్డారు. ఏమైనప్పటికీ, దానికి రహస్యమైన శక్తి కలదని ఆలోచిస్తూ, వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు ఇత్తడి సర్పమును ఆరాధించెను.
హిజ్కియా రాజు ఇత్తడి సర్పమును ముక్కలుగా పగలగొట్టినప్పుడు, దేవుడు ఆయన మీద సంతోషించి అతడు వెళ్లిన చోట అతననికి విజయమును ఇచ్చెను. (2 రాజు 18:3–7)
ఇత్తడి సర్పమును ముక్కలుగా పగలగొట్టిన హిజ్కీయాను దేవుడు ఎందుకు మెచ్చుకున్నారు? అది ఎందుకనగా విగ్రహాములను ఆరాధించు వారు నాశనము అయ్యినందున.
ఇత్తడి సర్పమును ఆరాధించే చరిత్ర అనేది సిలువను స్థాపించి ఆరాధించే సంఘాలు నాశనం అవుదురనే ప్రవచనము.
అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. యోహా 3:14–15
మనల్ని రక్షించినది సిలువ కాదు, కాని యేసు క్రీస్తు. (1 పేతురు 1:18–19)
ఏమైన, ఇశ్రాయేలీయులు ఇత్తడి సర్పమును ఎలాగో ఆరాధించెనో, నేడు సంఘాలు సిలువను ఆరాధిస్తున్నారు. ఇత్తడి సర్పము కేవలం ఇత్తడి మొక్క అయినట్లుగా, సిలువ అనేది కేవలం ఒక చెక్క మొక్క మాత్రమే. (అపో.స్త 5:30)
సిలువను స్ధాపించి ఆరాధించు సంఘాలు నాశనం అవుదురు. (ద్వీతియో 27:15)
నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. ప్రక 18:4
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి యొక్క బోధనలను అనుసరిస్తూ, దేవుని సంఘం ఇత్తడి సర్పము యొక్క సంఘటన సిలువ ఆరాధన యొక్క ప్రవచనము అని ప్రజలందరికీ తెలియజేయుచున్నది. పరిశుద్ధాత్మ యొక్క యుగానికి రక్షకుడైన తల్లయైన దేవుడు నివసించే దేవుని సంఘమునకు దయచేసి రండి, తద్వారా మీరందరూ చివరి నాశనము నుండి తప్పించుకొని రక్షింపబడగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం