దావీదు ప్రార్థన ముగియక ముందే దేవుడు అతని ప్రార్థనకు సమాధానమిచ్చెను, మరియు
ప్రార్థన యొక్క ఫలితంగా పెంతెకోస్తు పండుగ నాడు మారుమనస్సు పొందుటకు 3,000 మంది
ప్రజలను నడిపించుటకై ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించారు. అదేవిధంగా,
దేవుని యొక్క కార్యములన్నీ ప్రార్థన ద్వారా నెరవేరబడునని నమ్ముచూ,
మనమెల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రార్థించవలెను.
ఏలియా ఒంటరిగా తన హృదయపూర్వక ప్రార్థన ద్వారా 850 అబద్ధ ప్రవక్తలను ఓడించాడు,
మరియు యెహోషువా యొక్క హృదయపూర్వక ప్రార్థన సూర్యుడిని మరియు చంద్రుడిని
ఆగిపోయేలా చేసినది. మనం ఈ సందర్భాల ద్వారా చూస్తున్నట్లుగా, అన్ని అడ్డంకులను
అధిగమించే సామర్థ్యమును దేవుడు మనకిచ్చునది అది ప్రార్థన ద్వారా.
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,
తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును,
వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
మత్తయి 7:7–8
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల
దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన
ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక,
మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.
1 యోహాను 3:21–22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం