క్రీస్తు యొక్క మార్గమును సరిగ్గా వెంబడించుటకు, మనం మన స్వంత సిలువను ఎత్తవలెను. దేవుడైన యేసు, మానవాళి యొక్క రక్షణ నిమిత్తము సిలువ భారాన్ని మోశారు, మరియు మోషే మరియు అపొస్తలుడైన పౌలు వంటి విశ్వాసపు పితరులు సంతోషంతో తమ శ్రమల యొక్క సిలువను ఎత్తుకున్నారు. అదేవిధంగా, మనం కూడా మన స్వంత సిలువను మోయవలెను మరియు రక్షణ నిమిత్తము శ్రమల మార్గమును నడవవలెను.
అపొస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క సిలువ మార్గాన్ని వెంబడిస్తూ, అన్ని శ్రమలను ఆశీర్వాదాలుగా యెంచినట్లుగానే, దేవుని సంఘ సభ్యులు ఏ క్షణంలోనైనా సంతోషంగా తమ సిలువను ఎత్తికొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం ఎన్నటికీ మరచిపోకుండా ధృడమైన విశ్వాసంతో దేవుని మార్గాన్ని వెంబడిస్తారు.
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:10-12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం