ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించినందువల్ల మొదటి పది ఆజ్ఞల పలకలు ముక్కలుగా విరుగగొట్టబడెను. ఏమైనా, మారుమనస్సు పొందిన ప్రజలకు ఏడవ నెల పదియవ దినమున
దేవుడు రెండవ పది ఆజ్ఞల పలకలను ఇచ్చారు. దేవుడు ఈ దినమును పాపక్షమాపణ యొక్క
వాగ్ధానమును కలిగియున్న ప్రాయశ్చిత్తార్థ దినముగా నియమించారు, మరియు ఏడవ నెల
మొదటి దినమును శృంగధ్వని పండుగగా నియమించారు.
అన్ని ప్రార్థనలు ధూప ద్రవ్యముల యొక్క పొగగా మారి దేవుని వద్దకు వెళ్ళునని
అపొస్తలుడైన యోహాను చెప్పాడు. పరిశుద్ధాత్ముడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు బలహీనమైన మరియు వ్యర్థమైన విషయాలను వెంబడించే, మరియు
పరలోకంలోని నిత్య ఆశీర్వాదాలను చూచుటలో విఫలమయ్యే మానవాళి కొరకు
మధ్యవర్తిత్వం చేయుచున్నారని మనం గ్రహించవలెను. మనం దేవుని యొక్క కృప పట్ల
కృతజ్ఞతలు చెల్లిస్తూ, పశ్చాత్తాప హృదయాలతో దేవుని పండుగలను ఆచరించవలెను.
‘మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని,
ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.’
రోమా 8:25–26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం