మోషే పొందుకున్న మొదటి పది ఆజ్ఞలు విరిగిపోయాయి ఎందుకనగా
ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించారు.
ఇశ్రాయేలీయులు తమ పాపాలను గ్రహించి మారుమనస్సు పొందిన తర్వాత,
దేవుడు వారికి అనుగ్రహించిన రెండవ పది ఆజ్ఞలతో
మోషే క్షమాపణ యొక్క గురుతుగా క్రిందికి దిగివచ్చాడు.
ఇది ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క మూలంగా మారెను.
ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ప్రాయశ్చిత్తార్థ దినం వరకు ఆ పాపం తాత్కాలికంగా
పరిశుద్ధ స్థలమైన దేవునికి బదిలీ చేయబడుతుంది.
ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి రక్తాన్ని ప్రోక్షించే వేడుకను
చేపట్టిన తర్వాత, పాపం పూర్తిగా క్షమించబడుతుంది.
అదేవిధంగా, ఈనాడు, అతి పరిశుద్ధ స్థలమైన యెరూషలేము యొక్క, అనగా,
తల్లియైన దేవుని యొక్క కృపను పొందకుండా, ఎవ్వరూ పరిపూర్ణ
పాప క్షమాపణను లేదా రక్షణను పొందలేరు.
అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును
ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను.
అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి,
ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు
వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి,
తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.
ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును.
అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.
లేవీయకాండము 16:20-22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం