పాప క్షమాపణ పొందాలంటే, ఎవరైనా పాపాలను మోయవలెను. విశ్రాంతి దినము, అనుదిన దహన బలుల కొరకు జంతువుల బల్యర్పణలు, పాత నిబంధనలో పస్కా మరియు ఇతర అన్ని పండుగల అర్పణల ద్వారా, మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు పాత నిబంధన ధర్మశాస్త్రము ద్వారా, మరియు అరణ్యంలోకి పంపించబడి మరణించే విడిచిపెట్టు మేకపై అన్ని పాపాలను మోపే విషయాల ద్వారా దేవుడు మనకు దీనిని ముందుగానే ఛాయగా చూపించారు.
దేవుడు తన స్వకీయుల చేత సిలువ యొక్క శ్రమలను, హేళనను, మరియు నిర్లక్ష్యాన్ని అంతా సహించారని దేవుని సంఘ సభ్యులు గ్రహిస్తారు ఎందుకనగా తమ పాపములకు మూల్యం చెల్లించటం ద్వారా సమస్త మానవాళిని రక్షించాలనే దేవుని యొక్క గొప్ప ప్రేమ కారణంగా.
మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.౹ మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయు వారమగుదుము;
1 యోహాను 1:9-10
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
మత్తయి 20:28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం