మన జీవితాలంతటా, మనమందరం విభిన్నమైన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాము.
అటువంటి సంక్షోభ సమయాలలో, తండ్రి యుగంలో విశ్వాసపు పితరులు యెహోవా దేవునికి మొఱ్ఱపెట్టి రక్షింపబడ్డారు,
కుమారుని యుగంలో పరిశుద్ధులు యేసుక్రీస్తు నామంలో పిలిచి రక్షింపబడ్డారు, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
మనం రక్షింపబడుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని నామమును పిలవవలెను.
తన నామమును యెరిగినవారే తన నిజమైన ప్రజలని దేవుడు చెప్పారు, మరియు రక్షణ యొక్క
మొదటి అడుగు అయిన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో
బాప్తిస్మము నిర్వహించవలెనని మనకు ఆజ్ఞాపించారు.
ఈనాడు, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ మాత్రమే ప్రజలకు రక్షణ మరియు
పాప క్షమాపణ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నామము అయిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి నామమున బాప్తిస్మం ఇస్తుంది.
“దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా . . . కావున . . . నా జనులు నా నామము తెలిసికొందురు
నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.”
యెషయా 52:4–6
“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; . . .నా దేవుని పేరును,
పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను
నా దేవుని పట్టణపు పేరును . . . వాని మీద వ్రాసెదను.”
ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం