పాత నిబంధన యొక్క బలిఅర్పణలు పాపుల మారుమనస్సును మరియు
దేవుని ప్రాయశ్చిత్తమును కలిగియున్నది. ఆదాము మరియు హవ్వ మొదటి
పాపము చేసిన తర్వాత, కయీను మరియు హేబేలు తాము మరలా జీవ వృక్షము
వద్దకు వెళ్ళగలిగేలా అర్పణలను అర్పించుటకు దేవుడు వారిని అనుమతించారు.
మోషే సమయం ద్వారా బలిఅర్పణలు కొనసాగాయి మరియు క్రొత్త నిబంధన
సమయాలలో అవి ఆరాధన సేవలుగా మారాయి.
మనం దేవునికి అర్పించే ఆరాధన సేవలు లేకుండా,
పాప క్షమాపణ మనకెన్నటికీ ఇవ్వబడనేరదు.
పాత నిబంధన యొక్క అన్ని ఆరాధన సేవలలో,
పాపులకు బదులుగా జంతువులు రక్తాన్ని చిందించాయి.
ఏమైనా, క్రొత్త నిబంధన సమయాలలో,
యేసు క్రీస్తు స్వయంగా పాప బలి అర్పణగా అర్పించబడ్డారు.
కాబట్టి, యేసు తన బలిదానము చేత స్థాపించిన ఆరాధన సేవలన్నిటినీ
మనం ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను.
యేసు ప్రధాన యాజకుడిగా మారాడనే నిజమునకు మనం
ఆరాధన సేవలను అర్పించటం కొనసాగించవలెనని అర్థం.
దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దినము మరియు పస్కా లాంటి
అన్ని ఆరాధన సేవలను గైకొనును, మరియు దేవుడు మనకు
వాగ్ధానం చేసిన పాప క్షమాపణ మరియు పరలోకము కొరకుగల
నిరీక్షణ వద్దకు వెళ్ళుచున్నారు.
ఆయన . . . మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని
దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. హెబ్రీయులు 5:9–10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం