మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము తిన్న పాపము వల్ల ఆదాము మరియు హవ్వ ఏదేను తోట యొక్క మహిమను కోల్పోయినట్లుగానే, మానవాళి పరలోకంలో తమ పాపాల వల్ల సమస్త మహిమను కోల్పోయారు మరియు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డారు. మానవాళి తమ పాపముల వల్ల దేవుని నుండి వేరుచేయబడెను, కాని వారి పాపములు క్షమించుటకు ఒక మార్గముగా, విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా మూడు మార్ల ఏడు పండుగల ద్వారా తనను ఆరాధించేలా దేవుడు వారిని అనుమతించారు.
దేవున్ని సంతోషపెట్టిన హేబేలు యొక్క బల్యర్పణ, క్రీస్తు సిలువపై తన రక్తాన్ని చిందించటం ద్వారా మానవాళి యొక్క పాపాలను క్రీస్తు క్షమించునని ముందే సూచించటం మనం పరిశుద్ధగ్రంథంలో నిర్దారించుకోవచ్చు. రక్తపు బలిఅర్పణ ద్వారా, అనగా, ఆరాధన ద్వారా, మానవాళి దేవునికి దగ్గరవ్వగలరు మరియు పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా దేవుని కుటుంబంలో భాగం కాగలరు.
అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. ఎఫెసీయులు 2:13, 19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం