కొంతమంది ప్రజలు పరిశుద్ధ గ్రంథమును కేవలం ఇశ్రాయేలు యొక్క చరిత్ర లేదా పురాణశాస్త్రముగా పరిగణిస్తారు. ఏమైనప్పటికీ, పరిశుద్ధ గ్రంధం సుమారు 1600 సంవత్సరాల కాలంలో వివిధ వృత్తులు మరియు వయస్సుల డజన్ల కొద్దీ రచయితలచే వ్రాయబడిన చరిత్రలో అత్యంత పురాతనమైన పుస్తకం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనగా, 1600 సంవత్సరాల రికార్డులు ప్రవచనం మరియు నెరవేర్పుతో అనుసంధానించబడి ఉండటం.
పరిశుద్ధ గ్రంథపు రికార్డుల్లో, రాజైన కోరెషు గురించిన ప్రవచనం మరియు నెరవేర్పును మనం అధ్యయనం చేద్దాం. కోరెషు రాజు పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించిన మరియు ఓరియంట్ను పాలించిన రాజు. పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన అతని గొప్ప కార్యములన్నీ పరిశీలిద్దాం.
– పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఎజ్రా 1:2–3
పారసీకదేశపు రాజైన కోరెషు ఎందుకు ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించి ఇశ్రాయేలీయులను విడిపించాడు? కోరేషు రాజు ఇశ్రాయేలీయులను విడిపించడానికి ముందు దాదాపు 170 సంవత్సరాల వ్రాయబడిన యెషయా గ్రంథములో ఆయన పేరు వ్రాయబడినది చూశాడు.
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను . . . అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:1–3
కోరెషు రాజు దేవుని సహాయంతో బబులోనును జయించాడని గ్రహించి, పరిశుద్ధ గ్రంథం ప్రవచనాల ప్రకారంగా అతడు ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఆ ఫలితంగా, రాజైన కోరెషు దాసులను విడిపించి, మత స్వేచ్ఛను గుర్తించిన పురాతన చక్రవర్తిగా ఇప్పటికీ ప్రశంసించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసు క్రీస్తు భూమి పైకి రావడానికి దాదాపు 700 సంవత్సరాల ముందు శిశువుగా ఆయన పుట్టుకను ప్రవచించెను.
. . . ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యెషయా 7:14
ఈ ప్రవచనం ప్రకారం, దేవుడు కన్యక మరియ ద్వారా యేసు క్రీస్తుగా జన్మించారు (మత్తయి 1:18–23). అంతేకాక, యేసు క్రీస్తు ఎలా బాధపడతారో పరిశుద్ధ గ్రంథం వివరంగా ప్రవచించెను.
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును . . . మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీదపడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:3–5
ఈ ప్రవచనం ప్రకారం, యేసు క్రీస్తును ఈటెతో కుట్టి కొరడాతో కొట్టారు (మత్తయి 27:26–35; యోహాను 19:34). పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనాలు వ్రాయబడినప్పుడు ప్రజలకు అర్థం కానప్పటికీ, అవన్నీ నెరవేరెను.
కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు ప్రవచనాలను నిర్లక్ష్యము చేయకూడదని హెచ్చరించును (1 థెస్స 5:20). అది ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలను తృణీకరించినట్లయితే మనం రక్షింపబడలేము. నమోదు చేయబడిన అనేక ప్రవచనాలు నెరవేరినట్లుగా మిగిలి ఉన్న ప్రవచనాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుంది.
అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును. లూకా 21:11
చివరి తెగుళ్లు మరియు గొప్ప నాశనము వచ్చినప్పుడు, మనం రక్షింపబడటానికి సీయోనుకు పారిపోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది.
. . . పోగై రండి. సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొను టకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను, . . . యిర్మియా 4:5–6
దేవుని పండుగలను జరుపుకునే సీయోను దేవుడు మనకు వాగ్దానం చేసిన రక్షణ యొక్క ఆశ్రయ పురము (యెషయా 33:20). ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా దేవుని పండుగలను ఆచరించే ఏకైక సంఘము దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ మాత్రమే; అనగా సీయోను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం