ఈ ప్రపంచంలోని సంపద, గౌరవము మరియు అధికారం ఎక్కువ కాలం నిలవవు, కాని మరణం ఎదురైనపుడు అది వ్యర్థమగును. కావున, నిత్య ఆనందం ఉండే ఆత్మీక లోకం కొరకు సిద్ధపడవలెనని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మనకు సెలవిచ్చారు. ఎందుకనగా మన సారము మన శరీరము కాదు కాని మన ఆత్మ (యోహాను 6:63) నిత్యమైన ప్రపంచం గురించి తెలియని జీవితం వ్యర్థమైనది. ఈ భూమిపై మన స్వల్ప జీవితము నిత్యమైన ప్రపంచం కొరకు సిద్ధపడే సమయము.
నిత్య ఆత్మీక లోకంలోకి వెళ్ళుటకు మనమేమి చేయవలెను? దుఖం లేదా మరణం లేని నిత్య ఆత్మీక లోకంలో, (ప్రక 21:4) క్షయమైన శరీరము ప్రవేశించజాలదు, కాని నిత్యజీవమును కలిగియున్న వారు మాత్రమే ప్రవేశించగలరు. (1 కొరింథీయులు 15:50)
అయితే, మనము ఎలా నిత్యజీవమును పొందుకొనగలము? మనము యేసు క్రీస్తు యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగినపుడు, మనము నిత్యజీవమును పొందగలము (యోహాను 6:54)
పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము ఆయన శరీరము
మరియు రక్తము అని యేసు క్రీస్తు వాగ్దానం చేశారు. (మత్తయి 26:26)
కావున, పస్కా ద్వారా నిత్యజీవమును పొందుకొనువారు, విశ్వములో స్వేచ్ఛగా ప్రయాణించగలిగే ఆత్మీక లోకంలో ప్రవేశించగలరు రండి కేవలం భౌతిక ప్రపంచంపై మాత్రమే దృష్టి సారించి, మన జీవితాన్ని వృధా చేయకుండా, నిత్య ఆత్మీక ప్రపంచం కొరకు నిరీక్షిస్తూ, నిత్యజీవం యొక్క పరిశుద్ధ వాగ్దానంలో [పస్కా] పాల్గొందాం..
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు స్థాపించిన దేవుని సంఘం మాత్రమే, క్రొత్త నిబంధన యొక్క పస్కాను ఆచరించే ఏకైక సంఘము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం