మానవజాతి అంతా నరకానికి వెళ్లే దురదృష్టకర పరిస్థితిని చూసినప్పుడు అపొస్తలుడు యోహాను ఏడ్చాడు.
కానీ, పెద్దలలో ఒకరు అతనితో, "భవిష్యత్తులో, దావీదు వేరు చిగురు ముద్రింపబడిన
పరిశుద్ధ గ్రంథమును తెరిచి మానవాళిని కాపాడును." దావీదు యొక్క జీవితానికి అనుగుణంగా,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు 30 సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొంది,
మిగిలిన 37 సంవత్సరాలు పూర్తి చేశారు, మరియు క్రొత్త నిబంధనను మరియు మన పరలోకపు తల్లి
గురించిన సత్యముతో సహా, ముద్రింపబడిన పరిశుద్ధ గ్రంథము రహస్యాలను బయలుపరిచారు.
పరిశుద్ధ గ్రంథము యొక్క రహస్యాలు దావీదు ద్వారా మాత్రమే తెరవబడగలవు కాబట్టి,
మానవజాతి తప్పక దావీదును కలుసుకోవాలి. దావీదుగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు,
ఈ తాత్కాలిక జీవిత విషయాల గురించి కాకుండా నిత్య పరలోక రాజ్యము గురించి
మానవాళికి బోధించారు. అలాగే, దేవుని ప్రణాళిక లోపల దాచబడిన ఆత్మీక హవ్వ అయిన,
తల్లియైన దేవుని యొక్క ఉనికి గురించి ఆయన బోధించారు.
కాబట్టి, తల్లియైన దేవుడు నివసించే దేవుని సంఘమునకు సకల జనులు తరలి వెళ్ళుచున్నారు.
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా
ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు
సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
ప్రకటన 5:4-5
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి,
తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
హెబ్రీయులకు 9:27-28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం