దేవున్ని ఆరాధించే దినము అనగా వారము యొక్క దినాలలో శనివారమైన ఏడవ-దినపు విశ్రాంతి దినము.
విశ్రాంతి దినము అనునది దేవుడు ఆశీర్వాదాలతో వాగ్ధానం చేసిన ఒక పరిశుద్ధమైన దినము, మరియు మనం దేవుని
ప్రజలుగా గుర్తించబడే దినము. పది ఆజ్ఞలలో నాల్గవదిగా, ఇది మానవాళి తప్పక ఆచరించవలసిన
ఆరాధన దినము. అందువల్లే యేసు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, మరియు తల్లియైన దేవుడు
విశ్రాంతి దినమును ఆచరించే మాదిరిని చూపించారు.
దేవుడెందుకు కయీను అర్పణను తిరస్కరించి హేబేలు అర్పణను మాత్రమే స్వీకరించారు? నేటి ప్రమాణాల
ప్రకారంగా పాస్టర్లుగా ఉన్న, యాజకులైన అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహులను
దేవుడెందుకు నాశనం చేశారు? ఎందుకనగా వారు తమ స్వంత తలంపుల ప్రకారంగా నడుచుకొని
దేవుని వాక్యములను గైకొనలేదు. అదేవిధంగా, దేవుని చిత్తం ప్రకారంగా విశ్రాంతి దినమును ఆచరిస్తూ
దేవున్ని ఆరాధించటమే ఆశీర్వాదములకు రహస్యమైన తాళపు చెవి.
కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను . . .
ఆదికాండము 2:3
“విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.”
నిర్గమకాండము 20:8
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై
నిలుచుండగా
లూకా 4:16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం