తండ్రి యుగంలో మరియు కుమారుని యుగంలో దేవుడెలా ఎర్ర సముద్రమును
విభజించారో మరియు యెరికో పట్టణమును ఎలా పడిపోయేలా చేశారో, మరియు
సూర్యుడిని ఎలా ఆగిపోయేలా చేశారో లాంటి అద్భుతాలను మనం దగ్గరి నుండి
గమనించినపుడు, సమస్తము దేవుని వాక్యము వలన జరిగెనని మనం గ్రహించవచ్చు.
పరిశుద్ధాత్మ యుగంలో దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
ఈ భూమిపైకి ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చారు. సువార్త కార్యము దేవుని చేత
నెరవేరబడుచున్నదని నమ్ముచూ, మనం దేవుని వాక్యమును గైకొన్నప్పుడెల్లా,
సువార్త యొక్క అద్భుతమైన కార్యము ఈ క్షణమందు కూడా చేపట్టబడును.
(సీయోను పరిమళము: పెంతెకోస్తు ప్రచార పండుగ తర్వాత నాలుగు నెలలలో
సువార్త కార్యము సాధించబడెను.)
యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున . . . యెహోషువ
యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు
అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొనువరకు
సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను . . .
[యెహోషువా 10:12–13]
మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన
తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నీళ్లు విభజింపబడగా . . .
[నిర్గమకాండము 14:21-22]
ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు
పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు
మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున
వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి,
అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
[లూకా 5:4–6]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం