3,500 సంవత్సరాల క్రితం మోషే ధర్మశాస్త్రం ద్వారా పాత నిబంధన యొక్క
పండుగలన్నిటి యొక్క పేర్లు మరియు తేదీలను దేవుడు ముందే నియమించారు
మరియు పునరుత్థాన దినము (ప్రథమ ఫలముల పండుగ) నుండి 50వ దినమందు
పెంతెకోస్తు దినాన్ని ఆచరించుమని మనకు ఆజ్ఞాపించారు.
యేసు పునరుత్థానం తర్వాత, ఆరోహణ దినం నుండి శిష్యులు పది రోజుల
పాటుగా హృదయ పూర్వకంగా ప్రార్థించారు మరియు పెంతెకోస్తు దినమందు
పరిశుద్ధాత్మను పొందుకున్నారు; ఒక్క రోజులోనే మూడువేల మంది రక్షణ వద్దకు
నడిపించబడే పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యాన్ని వారు కళ్ళారా చూశారు.
అదే విధంగా, వాక్యము ప్రకారంగా దేవుని సంఘ పరిశుద్ధులు పెంతెకోస్తు
దినమును ఆచరిస్తున్నారు మరియు తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో
ప్రజలను మేల్కొల్పుచూ, కడవరి వర్షం యొక్క పరిశుద్ధాత్మ ద్వారా,
పరిశుద్ధాత్మ యొక్క యుగంలోని రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని గురించి సర్వ లోకానికి సాక్ష్యమిస్తున్నారు.
“అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు
గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల
యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.” అపొస్తల కార్యములు 1:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం