ఏదేను తోటలో ఉంచబడిన మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము
మరియు జీవ వృక్షము అనునవి, మానవాళికి పరలోక రాజ్యము గురించి
బోధించుటకై దేవుడు సృష్టించిన ఒక ఉపమానము మరియు ఒక మాదిరి.
మనకు నిత్య జీవమును ఇచ్చే ఏదేను తోటలోని జీవ వృక్షమునకు గల మార్గాన్ని దేవుడు
మాత్రమే తెరవగలరు. మనకు నిత్య జీవమునిచ్చుటకు, 2,000 సంవత్సరాల క్రితం యేసు
మనకు క్రొత్త నిబంధన పస్కాను ఇచ్చారు, మరియు ఈ యుగంలో మనకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
క్రొత్త నిబంధన పస్కాను ఇచ్చారు. కాబట్టి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దేవుడైయున్నారు.
నిజమైన క్రీస్తు పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యముల ప్రకారంగా
ఖచ్చితంగా ప్రత్యక్షమవుతారు. తొలినాటి సంఘ పరిశుద్ధులు తాము ఎక్కడికి వెళ్ళిననూ
యేసే క్రీస్తు అని ప్రకటించినట్లుగానే, ఈ యుగంలో క్రొత్త నిబంధన యొక్క పస్కాను
తీసుకువచ్చిన తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు రెండవసారి వచ్చిన క్రీస్తని మనం ప్రకటించవలెను.
“నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్య దినమున నేను వానిని లేపుదును.
నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది . . . నన్ను తినువాడును
నా మూలముగా జీవించును.”
యోహాను 6:54–57
“ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడ అపొస్తలులును పంక్తిని
కూర్చుండిరి. అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను
భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.”
లూకా 22:14–15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం