మనం దేవుని ధర్మశాస్త్రమును గైకొన్నప్పుడు, విస్తారమైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకు సిద్ధంగా ఉంటాయి. ఈ కారణంగా, తండ్రి యుగం నుండి దేవుడు స్థాపించిన పండుగలలో (విశ్రాంతి దినము, పస్కా వంటివి) ఎల్లప్పుడూ “మర్చిపోక, జ్ఞాపకముంచుకొని నిత్యము గైకొనండి” అనే ఆజ్ఞ ఉన్నది.
అన్ని యుగాలలో దేవుని ధర్మశాస్త్రమును ఆచరించువారు నీతిమంతులుగా దీవించబడుదురని మరియు దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించువారు తిరుగుబాటు చేసినందుకు శిక్షింపబడుదురని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడుటకు గల కారణం దేవుని ధర్మశాస్త్రమును ఆచరించకపోవడం ఫలితమే.
ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రమునతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక–నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి. దానియేలు 9:10–11
యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు 18:9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం