ఏలియా ఒక్కడే 850 అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా పోరాడాడు; బాలుడైన దావీదు గొల్యాతును ఓడించాడు; గిద్యోను యొక్క 300 మంది యోధులు 135,000 మిద్యానీయుల సైన్యముతో పోరాడారు; ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు శ్రమలు పొందారు; తొలినాటి సంఘము యొక్క పరిశుద్ధులు హింసను మరియు అమరవీరత్వమును ఎదుర్కొంటూ సువార్తను ప్రకటించారు. కష్టాల మధ్యన వారి హృదయాలు శుద్ధి చేయబడి, వారి విశ్వాసము దేవుని చేత ఆమోదించబడెను; చివరకు వారు విజయం యొక్క మహిమను పొందుకున్నారు.
తన పిల్లలు శ్రమలు పొంది అపవాది నుండి ఆటంకాలను ఎదుర్కొంటారని దేవుడు ముందే చూశారు. అయినను, శుద్ధీకరణ ద్వారా, ఆయన మొదటగా వారిలో తన పట్ల భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను, ప్రేమను, మరియు చెడును నిరాకరించి మంచిని వెంబడించే ఆత్మను పెంపొందించిన తర్వాత, తన సర్వశక్తి చేత వారి కొరకు అద్భుతాలు చేశారు.
వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. సామెతలు 17:3
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. యెషయా 46:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం