పాత నిబంధన సమయంలో మోషే యొక్క కాలంలో ఆచరించబడిన
ప్రథమ ఫలముల పండుగ ఒక ఛాయై యుండెను, మరియు
క్రొత్త నిబంధన యొక్క పునరుత్థాన దినము నిజ స్వరూపము.
ప్రథమ ఫలముల యొక్క పండుగ ప్రవచనాన్ని నెరవేర్చుటకు
యేసు క్రీస్తు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా,
విశ్రాంతి దినమునకు మరుదినమున, ఆదివారము,
తెల్లవారు జామున ఆయన పునరుత్థానమయ్యారు.
కాబట్టి, వారం వారం పండుగగా విశ్రాంతి దినమును (శనివారము),
మరియు సంవత్సరీకపు పండుగగా పునరుత్థాన దినమును
మనం గైకొనటం దేవుని చిత్తము.
సాతాను మానవాళిని మరణపు వేదనను అనుభవించేలా చేస్తూ
వారిని మరణపు గొలుసుల క్రింద ఉంచినది;
ఏమైనా, యేసు క్రీస్తు మరణపు శక్తిని బ్రద్ధలు గొట్టుచూ
ఈ భూమిపైకి వచ్చారు, మరియు ప్రజలను పునరుత్థాన దినము
ద్వారా నిత్య జీవము వద్దకు నడిపిస్తూ వారిని
సత్యము వద్దకు నడిపించారు.
ఈరోజులలో, దేవుని సంఘము యొక్క సభ్యులు
గ్రుడ్లను పంచుకునే అన్యమత సంప్రదాయాన్ని పాటించక,
యేసు క్రీస్తు యొక్క మాదిరిని వెంబడిస్తూ,
మన ఆత్మీక నేత్రములను తెరిచే రొట్టెను విరుచును.
“ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు
మృతులలోనుండి లేపబడియున్నాడు.
. . . క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” 1 కొరింథీయులు 15:20–22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం