పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ అనునది క్రొత్త నిబంధనలో
పునరుత్థాన దినము. అది ఆదివారమందు నెరవేరబడివలసియున్న ప్రవచనము.
అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రము యొక్క
మరోవైపున నేలను చేరుకోవటం వారములోని మొదటి దినమందు జరిగెను.
దేవుడు ఈ దినమును ప్రథమ ఫలముల పండుగగా నియమించారు,
మరియు ఇశ్రాయేలీయులను దీనిని ప్రతి సంవత్సరము విశ్రాంతి దినమునకు
మరుసటి దినమందు (ఆదివారము) ఆచరించేలా చేశారు. యేసు ప్రథమ ఫలముల
పండుగను నెరవేర్చుచూ, వారంలో మొదటి దినమందు (ఆదివారము) పునరుత్థానమయ్యారు.
ప్రథమ ఫలముల పండుగ యొక్క ప్రవచనం ప్రకారంగా, మొదటి పంట యొక్క పన
దేవునికి అర్పించబడినపుడు, యేసు నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా పునరుత్థానమయ్యారు
మరియు సమస్త మానవాళికి పునరుత్థానపు ఆశను ఇచ్చారు.
దీనిని నమ్ముచూ, దేవుని సంఘము ప్రతి సంవత్సరము పునరుత్థాన దినమును ఆచరిస్తుంది.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను . . . మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు
మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు
అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున
యాజకుడు దానిని అల్లా డింపవలెను.
లేవీయకాండము 23:9–11
ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని
సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి
గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు . . . వీరు సజీవుడైన వానిని మీరెందుకు
మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు . . .
లూకా 24:1–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం