మన విశ్వాస మార్గంలో మనం శ్రమలు, కష్టాలు మరియు సిలువ భారాన్ని ఎదుర్కొన్నప్పుడు, "నేను దురదృష్టవంతుడను"
అని భావిస్తూ, ఈ కష్టాలను శ్రమలుగా యెంచువారు, నిజంగా విచారంగా ఉంటారు, అయితే
ఈ పరిస్థితుల్లో ఆశీర్వాదాలను గ్రహించి, కృతజ్ఞతలు తెలుపువారు, సంతోషాన్ని పొంది, పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, "ఎల్లప్పుడూ సంతోషించండి మరియు
ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించండి" అని చెబుతారు మరియు లౌకిక దురాశ శోధనను
మరియు దుఃఖాన్ని కలుగజేస్తాయి కాబట్టి సంతృప్తికరమైన జీవితాలను గడపాలని మనకు బోధిస్తారు.
ఏ దురదృష్టకర పరిస్థితినైనా సంతోషకరమైన శక్తిగా మార్చడం ద్వారా దేవభక్తిగా ఉండుటకు
సాధన చేయాలని వారు మనకు బోధిస్తారు.
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;౹ ప్రతి విషయమునందును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.౹
1 థెస్సలొనీకయులు 5:16-18
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.౹ . . ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.౹ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.౹
యాకోబు 1:12-15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం