ప్రాయశ్చిత్తార్థ దినము అనునది ప్రజల యొక్క మరియు యాజకుల యొక్క అన్ని పాపాలను క్షమించబడే గొప్ప దినము. ఇశ్రాయేలీయులు దేవుని కృపను మరిచారు మరియు బంగారు దూడ విగ్రహాన్ని పూజించి పాపం చేశారు. అందుకే మోషే దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల మొదటి పలకలను పగుల గొట్టెను. ఇశ్రాయేలీయులు తమ పాపాల గురించి మారుమనస్సు పొందారు మరియు దేవుడు వారికి పది ఆజ్ఞల యొక్క రెండవ పలకను అనుగ్రహించారు; ఈ రోజు ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క మూలంగా మారెను.
పాత నిబంధనలో, ప్రాయశ్చిత్తార్థ దినం వరకు ఇశ్రాయేలీయుల యొక్క పాపాలన్నీ తాత్కాలికంగా విడిచిపెట్టు మేకపైకి బదిలీ చేయబడ్డాయి. ఈరోజు, మన పాపాలన్నీ పరిశుద్ధ ఆలయం యొక్క నిజరూపమైన క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు తల్లియైన దేవునికి బదిలీ చేయబడ్డాయి. అయితే, ప్రాయశ్చిత్తార్థ దినమందు, మన పాపాలన్నీ పాపానికి మూల పురుషుడైన సాతానుకు బదిలీ చేయబడతాయి. చివరికి, సాతాను అగాధంలో, అంటే నరకంలో తీర్పు తీర్చబడతాడు, ఆపై, అన్ని పాపాలు చివరకు అదృశ్యమవుతాయి.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.
లేవీయకాండము 23:26-27
మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి–ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹
యోహాను 1:29
వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు.
ప్రకటన 20:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం