వాతావరణంలో మార్పులు చాలా తక్కువగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలలో, చెట్లకు తరచుగా స్పష్టమైన ఎదుగుదల వలయాలు ఏర్పడవు, అయితే వాతావరణ మార్పులు, తెగుళ్లు, కరువులు మరియు వరదల వలన శ్రమపడిన చెట్లు స్పష్టమైన ఎదుగుదల వలయాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా, ప్రతి వ్యక్తి పరలోక రాజ్యం కొరకు ఏవిధమైన జీవితాన్ని జీవించారో తెలియజేసే వారి స్వంత ఎదుగుదల వలయాలను కలిగియున్నారు. కాబట్టి, ఒక ఆత్మను రక్షించుటకు శ్రద్ధగల హృదయముతో దేవుని చిత్తాన్ని ఆచరించుట ప్రాముఖ్యము.
ప్రతిరోజు, ప్రతి వ్యక్తి ఇంటిలోనైనను సంఘములోనైనను పరలోకపు ఎదుగుదల వలయాలను ఏర్పరచుకొనుచున్నారు. సువార్త ప్రకటించునప్పుడు, ఆరాధనలో పాల్గొనునప్పుడు, మరియు ప్రార్థించునప్పుడు మనము కలిగియుండు మనస్తత్వమే మన పరలోకపు ఎదుగుదల వలయాలను నిర్ణయిస్తుంది. దానినిబట్టి ప్రతి వ్యక్తికి ఆశీర్వాదములు మరియు బహుమానములు అనుగ్రహింపబడును.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. ప్రకటన 22:12
తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మ నుబట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. గలతీయులు 6:8-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం