పులియని రొట్టెల పండుగ అనునది మన పాపముల పట్ల మారుమనస్సు పొందుచూ,
పిల్లవాని విశ్వాసమును వదిలివేసి, క్రీస్తు యొక్క జీవితము మరియు శ్రమలను
మనం తిరిగి చూసుకునే ఒక పండుగ. అపొస్తలుడైన పౌలు వలె, మన విశ్వాసము
ఒక పరిపక్వత గల విశ్వాసముగా ఎదగవలెను, తద్వారా మనం మన విశ్వాస జీవితంలో
ఎదుర్కొనే అనేక కష్టాల పట్ల నిజంగా మనమెలా కృతజ్ఞతగా ఉండవలెనో నేర్చుకోవచ్చు.
యేసు దేవునిగా తనకు అర్హమైన కీర్తి మరియు గౌరవం గల జీవితాన్ని గడపలేదు.
ఆయన తన పిల్లల కొరకు ఇతరుల నుండి వచ్చిన హేళన మరియు ద్వేషంతో పాటుగా
సిలువపై శ్రమలను ఆయన సహించారు. అదేవిధంగా దేవుని సంఘ సభ్యులు
తమ స్వంత సంతోషం కొరకు కాక, ఇతరుల జీవితం కొరకు జీవిస్తారు.
దేవుడు సంతోషించే పరిపూర్ణ జీవులుగా క్రొత్తగా జన్మించుటకు వారు పాటుపడుదురు.
ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని-వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో
పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచుచున్నదని అడిగెను.
అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద
ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అర చేతులతో కొట్టి క్రీస్తూ,
నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.
మత్తయి 26:65–68
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం