అపొస్తలుడైన పౌలు ఒక గొప్ప ప్రవక్తగా మారెను ఎందుకనగా అతడు మూడవ ఆకాశము యొక్క మహిమను చూశాడు. మానవాళి కొలవలేని విశాల విశ్వంలో, దేవుడు మన కొరకు ఒక మహిమగల భవిష్యత్తును సిద్ధపరిచారు. ఇందువల్లనే ఆయన మనలను ఈ భూమి వైపు కాక, విశ్వము వైపు—అనగా పరలోక రాజ్యం వైపు చూడవలెనని విశాలమైన దృక్కోణమును కలిగియుండుటకు పిలిచారు.
పరలోక రాజ్యము యొక్క మహిమపై మరియు అక్కడ మన కొరకు వేచియున్న అద్భుతమైన భవిష్యత్తుపై దృష్టి పెట్టడం ద్వారా మనం ఈనాటి కష్టాలను జయించవలెను. మనం పరలోక రాజ్యాన్ని విశ్వసించడంలో విఫలమైనట్లైతే, మనం చివరకు తాత్కాలిక శ్రమల మధ్యన మన విశ్వాసాన్ని కోల్పోయి సత్యమును వదిలివేస్తాము. ఏమైనా, మనం నిజంగా పరలోక రాజ్యము యొక్క నిజస్వరూపమును గ్రహించినట్లైతే, దాని మహిమలో మనం పాలుపంచుకొనేలా చేస్తూ, మన విశ్వాసము దిన దినము వృద్ధి చెందును.
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. రోమీయులకు 8:6
ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. రోమీయులకు 8:24–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం