మట్టపు గుండు అనునది ఒక భవనం నిటారుగా కట్టబడెనో లేదో చూచుటకు
ఏర్పాటు చేయబడినట్లుగా, దేవుడు యోబు, షద్రకు, మేషాకు, మరియు అబీద్నెగో
విషయంలో చేసినట్లుగా తన పిల్లలు తమ విశ్వాసపు ఇంటిని వారు సరిగ్గా
నిర్మించుకున్నారో లేదో చూచుటకు ఆయన వారికి కష్టాలను ఇచ్చును.
ఏమైనా, చివరకు ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వెంబడిస్తాయి.
దేవుడు సర్వలోకమును పరీక్షించునపుడు, ఆయన ప్రతి ఒక్కరి మాటలను, క్రియలను,
మరియు హృదయాలను పరీక్షించునని మరియు తర్వాత సణిగేవారు మరియు
ఫిర్యాదులు చేసేవారి విశ్వాసహీనులపైకి వినాశనములు తెచ్చునని
ఈనాడు తమ విశ్వాసపు ఇళ్ళను నిర్మించుకుంటున్న సభ్యులకు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు బోధించియున్నారు.
ఏ సందర్భంలోనైనా సభ్యులు ఎల్లప్పుడూ పరలోకము మరియు దేవుని గురించి
మాత్రమే ఆలోచించవలెనని కూడా వారు బోధించారు.
మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన
యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచెను . . . అప్పుడు యెహోవా
సెలవిచ్చినదేమనగా “నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు
వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను.”
ఆమోసు 7:7–8
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను
హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును.
మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
ప్రకటన 2:23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం