విగ్రహారాధనలో పడిపోయిన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించి వారికి రెండవ పది ఆజ్ఞాలను అనుగ్రహించిన ప్రాయశ్చిత్తార్థ దినమును మనం జ్ఞాపకముంచుకొనుటకు, దేవుడు పరిశుద్ధ క్యాలండర్ యొక్క ఏడవ నెల మొదటి దినమును శృంగధ్వని పండుగగా నియమించారు. అంతేగాకుండా, మారుమనస్సు కొరకు పిలుపునిచ్చుటకు శృంగధ్వని పండుగ నాడు బూరలు ఊదబడినట్లుగానే, యేసు కూడా ఈ భూమిపైకి వచ్చి, “మారుమనస్సు పొందుడి” అని సెలవిచ్చారు మరియు మానవాళిని మారుమనస్సు పొందుమని ప్రోత్సహించారు.
తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మరియు నీనెవెలోని 1,20,000 ప్రజలను రక్షణ వద్దకు నడిపించిన యోనా వృత్తాంతంలో మనం చూడగలిగినట్లుగా, మారుమనస్సు యొక్క కార్యమును అనుసరించి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సిద్ధపరచబడి ఉంటాయి. ఈరోజు కూడా, ప్రపంచం వైపు మళ్ళిన కన్నులు మరియు హృదయాల పట్ల యోనా వలె పరిపూర్ణమైన మారుమనస్సును సాధించి, లోకమంతా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి వద్దకు మరియు తల్లియైన దేవుని వద్దకు తిరిగి రావలెనని బూరను మ్రోగించవలెను.
–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం