పస్కా యొక్క శక్తి ద్వారా దేవుడు మోషేను మరియు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించారు. ఇశ్రాయేలీయులు 38 సంవత్సరాలుగా పస్కాను ఆచరించలేదు, కానీ వారు కనాను దేశంలోకి ప్రవేశించే ముందు పస్కాను ఆచరించారు. క్రొత్త నిబంధన పస్కా ద్వారా, యేసు స్వయంగా వచ్చి మానవాళికి నిత్య జీవమును అనుగ్రహించారు. ఈ విషయాల ద్వారా, మానవజాతి అంతా తమ పితరుల నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆజ్ఞ పస్కా అని మనం చూడవచ్చు.
1,600 సంవత్సరాలుగా ఆచరించని క్రొత్తనిబంధన యొక్క పస్కా పండుగను, ఈనాడు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మళ్లీ మనకు బోధించారు మరియు తల్లి అయిన దేవుని మార్గదర్శకత్వంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘం సభ్యులు దీనిని జరుపుకుంటున్నారు. ఎందుకంటే పస్కా పండుగలో దేవుని బిడ్డగా మారే అద్భుతమైన ఆశీర్వాదం ఉంది.
“నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి. మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము.”
యోబు 8:5-9
శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి . . . యేసు ఒక రొట్టె పట్టుకొని . . . మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని . . . దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
మత్తయి 26:17-28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం