మనం దేవుని వాగ్దానాలను ఉల్లంఘించి, పరిశుద్ధతకు మరియు దేవత్వానికి దూరంగా ఉన్నట్లైతే, మనం తీర్పునకు లోబడి ఉంటాము. నోవహు కాలంలో, సొదొమ గొమొఱ్ఱా కాలంలో, మరియు ఈ చివరి యుగంలో ఈ లోకంపై దేవుని యొక్క తీర్పు వెనుకన ఒక సాధారణ తంతు ఉన్నది: ప్రజలు దేవుడిని వదిలి తిరుగుబాటుదారులుగా, దుష్టులుగా, మరియు వ్యభిచారులుగా మారారు.
ఈనాడు, నోవహు వలె, మనం ఇంకా చూడని విషయాల పట్ల ధృడమైన విశ్వాసం కలిగియుండాలి. దేవుడు దుష్ట లోకాన్ని అగ్నితో తీర్పుతీర్చునని పరిశుద్ధగ్రంథపు ప్రవచనమును విశ్వసిస్తూ, దేవుని సంఘము క్రొత్త నిబంధన పస్కాను ప్రకటిస్తుంది, ఇది ప్రపంచాన్ని వినాశనముల నుండి రక్షించే దేవుని వాగ్దానమును కలిగియున్నది.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. 2 పేతురు 3:6–7
...అది యెహోవాకు పస్కాబలి. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నిర్గమకాండము 12:11–13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం