దేవున్ని విశ్వసించువారు దేవుని బోధనల ప్రకారంగా పర్ణశాలల పండుగను తప్పక ఆచరించవలెను. ఎందుకనగా పర్ణశాలల పండుగను ఆచరించువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించునని మరియు ఆచరించనివారిపై శిక్ష విధించునని జెకర్యా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చారు.
తన మొదటి రాకడలో యేసు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు; రెండవ రాకడలో, పర్ణశాలల పండుగ నాడు ఆత్మ మరియు పెండ్లికుమార్తె పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నారు. “ఆత్మ మరియు పెండ్లికుమార్తె జీవజలమును ఇచ్చును,” “యెరూషలేము నుండి జీవజలము ప్రవహించును,” మరియు “దేవుని సింహాసనము నుండి జీవజలముల నది ప్రవహించును” అనే పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాలు, యెరూషలేము పరలోకపు తల్లి మానవజాతికి పరిశుద్ధాత్మను మరియు జీవమునకు నడిపించే బోధనలను అనుగ్రహించునని ముందుగా తెలియజేస్తున్నాయి.
యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక... ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను... నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ నుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను... యోహాను 7:2–39
ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం