గిద్యోను ఇశ్రాయేలు యొక్క గోత్రములన్నిటిలో బలహీనమైన తెగకు చెందినవాడై తన పితరుల కుటుంబంలో కనిష్టుడై యుండెను. అయిననూ అతడు దేవుని వాక్యమునకు విధేయతగా ఉంటూ కేవలం 300 మంది సైనికులతో 135,000 మిద్యానీయులను ఓడించగలిగెను. మోషే మరియు యెహోషువా కూడా దేవుని వాక్యమును గైకొని అమాలేకీయులతో యుద్ధము గెలిచారు. అదేవిధంగా, ఈరోజు, కూడా, దేవుని సహాయమును నమ్మి ఆయనకు విధేయతగా ఉండటం ద్వారా
అన్ని పరిస్థితులలో విజయము దక్కును.
“దేవుడు ఎన్నికలేని వారిని బలమైన జనముగా చేయును” అని ప్రవచించినట్లుగా,
ఈ భూమిపై స్వల్పంగా కనపడే విషయాలు కూడా, సమస్తము దేవుని యొక్క
ప్రణాళిక ప్రకారంగా మరియు దేవుని వాక్యమును గైకొనటం ద్వారా సాధించబడుచున్నదని
గ్రహించువారు, దీవించబడెదరు.
అతడు “చిత్తము నా యేలిన వాడా,” “. . . నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా . . . “నేను నీకు తోడై యుందును . . . మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.”
న్యాయాధిపతులు 6:15–16
“నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.”
యెషయా 60:21–22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం