ఈ భూమిపై జీవితం అంతం కాదని యేసు క్రీస్తు ధనవంతుడు మరియు లాజరు యొక్క
ఉపమానం ద్వారా మానవాళికి బోధించారు. లాజరు, ఈ భూమిపై పేదరికంలో ఉన్నప్పటికీ,
పరలోకం పట్ల నిరీక్షణతో ఒక యాత్రికునిగా జీవించి చివరకు సంతోషాన్ని పొందెను.
మరోవైపు, ధనవంతుడు విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు,
కాని అతడు సంచారకునిగా జీవించాడు.
అతను పరలోక రాజ్యం కోసం సిద్ధపడటంలో విఫలమయ్యాడు
మరియు చివరకు నరకంలో బాధపడ్డాడు.
“ఈ భూమిపై మనం పరదేశులము మరియు యాత్రికులము” అని చెప్పిన
అబ్రహాము మరియు మోషే వంటి విశ్వాపు పితరుల సాక్ష్యాన్ని
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళికి అందించారు.
పరిశుద్ధ గ్రంథంలోని ఈ నమోదులు ద్వారా, వారు తిరిగి వెళ్ళవలసిన
తమ నిజమైన గృహము పరలోక రాజ్యమని
సమస్త మానవాళికి జ్ఞానోదయం చేశారు.
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరము నుండి చూచి
వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునైయున్నామని ఒప్పుకొని,
విశ్వాసముగలవారై మృతినొందిరి.
హెబ్రీయులు 11:13
మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు
నాయందును విశ్వాసముంచుడి.
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, . . . మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
. . . నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి . . .
యోహాను 14:1–3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం