పరిశుద్ధగ్రంథము ఈ యుగమును గొప్ప సంక్షోభ సమయముగా ప్రవచనాత్మకంగా వర్ణిస్తుంది.
దేశాల మధ్య యుద్ధాలు మరియు లెక్కలేనన్ని వాతావరణ విపత్తులు జరుగుచున్నందున,
ప్రజలు అంతరిక్షమునకు, మహాసముద్రపు లోతులలోకి, లేక లోతైన భూగర్భములోకి
తప్పించుకొనుటకు ప్రణాళికలు రచిస్తారు.
ఏమైనప్పటికీ, తల్లియైన దేవుడు నివసించే సీయోను తప్ప, రక్షణ యొక్క ఆశ్రయం లేదని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది.
దేవుడు దానియేలుకు రాజైన నెబుకద్నెజరు యొక్క కలను బయలుపరిచి వివరించినట్లుగానే,
ఈనాడు వినాశనముల మధ్యన సురక్షితమైన ఆశ్రయం తల్లియైన దేవుడని ఆయన బయలుపరిచారు.
ఆపద సమయాలలో పిల్లలు తమ తల్లి చేతులలో సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నట్లుగానే,
విపత్తులలో మానవాళి కొరకు తల్లియైన దేవుడే అత్యంత సురక్షితమైన స్థలమని
దేవుడు బయలుపరిచారు.
ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.
మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్రమత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరునులేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను;
ఇదే యెహోవా వాక్కు.
జెఫన్యా 1:2-3
అయితే దుష్టు డైన యొక దాసుడు–నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని
తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి,
వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును.
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
మత్తయి 24:48–51
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం