పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత దేవుని చిత్తం చేయువారికి మాత్రమే చెందుతుంది. పరిశుద్ధగ్రంథము సమస్త మానవాళికి దేవుడు పంపిన రక్షణ సందేశము, పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన ప్రవక్తలచే ఆయన చిత్తము వ్రాయబడినందున, దాని వాక్యములకు మనమెన్నటికీ కలపకూడదని లేదా తీసివేయకూడదని దేవుడు ఆజ్ఞాపించారు.
పరిశుద్ధగ్రంథంలో, దేవుడు దాదాపు 2,500 మార్లు, ఏకవచనంలో కాకుండా, బహువచనంలో సూచించబడెను. అంతేగాకుండా, దేవుని చిత్తం ప్రకారం సృష్టించబడిన మొక్కల ప్రపంచంలో మరియు జంతువుల ప్రపంచంలో ఒక తల్లి ఉన్నట్లుగా, పరలోక రాజ్యంలో కూడా, నిత్య జీవమును ఇచ్చే తల్లియైన దేవుడు ఉన్నారని మరియు మన ఆత్మీక పరలోక కుటుంబం ఉన్నదని పరిశుద్ధగ్రంథం సాక్ష్యమిస్తుంది.
–కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీయులు 6:17–18
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి. గలతీయులు 4:26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం