పారసీక రాజైన కోరెషు, పరిశుద్ధగ్రంథంలో తన గురించిన ప్రవచనాన్ని కనుగొని, ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించేలా కదిలిపోయి, యెరూషలేములో మందిరాన్ని నిర్మించినట్లుగానే, మనం కూడా పరిశుద్ధగ్రంథంలో నమోదు చేయబడిన ప్రవచనాలను నమ్మవలెను. కోరేషు వలె అదే గాఢమైన ఆనందంతో నింపబడి, దేవుడు మనకు ఆజ్ఞాపించిన సువార్తను మన పూర్ణ హృదయంతో మరియు పూర్ణాత్మతో ప్రకటించవలెను.
పది మినాల ఉపమానం ద్వారా యేసు బోధించినట్లుగా, దేవుని వాక్యమునకు భయభక్తులు గలవారికి ఆయన మహిమగల భవిష్యత్తును వాగ్దానం చేశారు. ఆ భవిష్యత్తులో, మరణము, దుఃఖము, ఏడ్పు, వేదన లేని పరలోక రాజ్యంలో వారు దేవునితో కలిసి యుగయుగాలు పాలించుచూ నిత్య మహిమను అనుభవిస్తారు.
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. . . .ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన 21:1–4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం