“మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు” అనే దేవుని యొక్క ధర్మశాస్త్రమును
మరిచిపోయినందున ఆదాము మరియు హవ్వ పాపం చేసినట్లుగానే, మనం దేవుని ధర్మశాస్త్రమును
మరిచిపోయినప్పుడెల్లా, మనం పాపం చేసి వినాశనములను పొందుకుంటాము.
ఈ యుగంలో కూడా, ఈ లోకము దేవుని ధర్మశాస్త్రమును —విశ్రాంతి దినమును మరియు క్రొత్త నిబంధన
యొక్క పస్కాను మరచిపోయి, వాటిని ఆచరించనందున చివరి వినాశనము వచ్చునని దేవుడు సెలవిస్తున్నారు.
మానవులు పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన ఆత్మలు ]దేవదూతలు].
వారు ఈ భూమిపై జీవిస్తుండగా దేవుని వాక్యమును గైకొన్నప్పుడు మాత్రమే పరలోకానికి తిరిగి వెళ్ళగలరు.
దేవుని వాక్యము ప్రకారంగా హిజ్కియా రాజు ధర్మశాస్త్రమును ]పస్కాను] గైకొని
ఆశీర్వాదాలు పొందినట్లుగానే, దేవుని సంఘము దేవుని యొక్క ధర్మశాస్త్రమును—
క్రొత్త నిబంధనను వెంబడిస్తూ దేవుని చిత్తాన్ని గైకొంటుంది.
నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక
నీ దేవుడైన యెహోవాను మరచి . . .
ద్వితీయోపదేశకాండము 8:11
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? . . .
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
. . . మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా,
నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
మత్తయి 7:21–23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం