నోవహు చాలా కాలం పాటుగా ఓడను నిర్మిస్తున్నప్పుడు ఒంటరితనాన్ని ఎదుర్కొన్నప్పటికినీ దేవుని ఆశీర్వాదాన్ని విశ్వసించాడు. మోషే ఐగుప్తులో ఒక రాజకుమారునిగా తన మహిమను ఆనందించుటకు బదులుగా దేవుని ప్రజలతో కలిసి శ్రమలు అనుభవించుటకు ఇష్టపడ్డాడు. అపొస్తలుడైన పౌలు అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికినీ, ప్రజలకు పరలోక రాజ్యాన్ని అందించే అవకాశం పట్ల సంతోషించాడు. అదేవిధంగా, దేవుని సంఘము యొక్క సభ్యులు తమ సిలువలను మోస్తూ, విశ్వాసపు మార్గాన్ని సంతోషంగా నడుస్తారు.
పరలోక తల్లి ఎల్లప్పుడూ మనకు, “మనం పరలోక రాజ్యం పట్ల నిరీక్షణ కలిగియుండలేదా?” అని గుర్తు చేస్తారు. కాబట్టి, ముందు వరుసలో పనిచేసే పరిశుద్ధులైనా లేక పాస్టర్ల బృందమైనా, మన స్వంత సిలువలను మనం భరించుచుండగా, మన కళ్ళముందు విప్పబడిన అడ్డంకులను దాటి సిద్ధపరచబడిన పరలోక రాజ్యము యొక్క ఆశీర్వాదాలను ప్రతిఒక్కరూ చూడవలెను.
ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, . . . ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీయులు 11:26
మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. . . . క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. రోమీయులు 8:13-18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం